Chandrababu: రైతుల ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి..! 13 d ago
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు. ధాన్యపు రాశులు వర్షాలకు తడవకుండా సమీప రైసుమిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన టార్ఫాలిన్లు సమకూర్చాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.
ఏపీలో ఈనెల 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.